మన తెలంగాణ/కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సాధారణ బోర్డు పాలకమండలి సమావేశం శుక్రవారం సికింద్రాబాద్ కార్యాలయంలో జరిగింది. బోర్డు అధ్యక్షుడు బ్రి గేడియర్ సోమశంకర్ అధ్యక్షతన సిఈఒ మధుకర్‌నాయక్, సివిల్ నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో మొదటగా ఎమ్మెల్యే సాయ న్న మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఏప్రిల్ 30న జరగనున్న ఎన్నికలకు సంబంధించి షెడ్యూలును విడుదల చేశారు.
మార్చి 4 వరకు కంటోన్మెంట్ ప్రాంతంలో ఓటర్ నమోదు ప్రక్రియ 6 తేదీన అభ్యంతరాల స్వీకరణ మార్చి 23న తుది జాబితా వెలువడుతుందన్నా రు. మార్చి 28, 29 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 29న జాబితా సిద్ధం అవుతుందన్నారు. అదే విధంగా ఏప్రిల్ 1న పరిశీలన, ఏప్రిల్ 6 తేదీ వరకు విత్‌డ్రాలతోపాటు ఏప్రిల్ 10న తుది జాబితా అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులు ఉంటాయన్నారు. రిజర్వేషన్ల ప్రకారం 1, 3, 4, 7 వార్డులు జనరల్, 2,5,6 మహిళలకు, 8వ వార్డు షెడ్యూల్డ్ కులాలు కేటాయించారు. ఏప్రిల్ 30న ఎన్నికలను జరపనున్నట్లు పేర్కొన్నారు.