Sunday, January 26, 2025

రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘటనాస్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. లాస్య నందిత కారు పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన కారు రెయిలింగ్ ను ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యారు. తక్షణమే అతన్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. లాస్య నందిత దివంగత నేత సాయన్న కుమారై. గతేడాది ఫిబ్రవరరి 19న నందిత తండ్రి సాయన్న మృతి చెందాడు. ఏడాది వ్యవధిలోనే తండ్రి సాయన్న, కుమారై నందిత మృతి చెందడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నందిత ఎమ్మెల్యేగా గెలిచింది. గతంలోనూ నార్కట్ పల్లి వద్ద నందిత ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News