Wednesday, January 22, 2025

ముగిసిన సిబిపి కార్యక్రమం

- Advertisement -
- Advertisement -
ఉద్యోగులకు సర్టిఫికెట్ల ప్రదానం

హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ (ఈపిటిఆర్‌ఐ ) భారత ప్రభుత్వం ఈ మేరకు వారం పాటు నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రొగ్రామ్ ( సిబిపి) శనివారం హైదరాబాద్‌లో ముగిసింది. ప్రభుత్వ అధికారులను మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దేందుకు, వృత్తిపరంగా మరింత ప్రగతిశీలంగా తయారు చేయడం ద్వారా వారిని భవిష్యత్తు కోసం సిద్ధం చేయాలనే లక్షంతో కేంద్రం ఈ సిబిపి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు , తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్ పర్సన్ డాక్టర్ రాజీవ్ శర్మ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ వాణీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కోహార్ట్ కోర్సు పూర్తి చేసిన ఉద్యోగులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News