- Advertisement -
చండీగఢ్: పంజాబ్‌లో తిరుగులేని నాయకుడుగా ఉండిన కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ‘ఆమ్ ఆద్మీ ప్రభంజనం’కు పంజాబ్ రాజకీయమే మారిపోయింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అజిత్ పాల్‌సింగ్ కోహ్లీ చేతిలో 19,797 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సిద్ధూతో గొడవ, కాంగ్రెస్ లుకలుకల కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి స్వంత పార్టీ పెట్టుకున్నారు. ఊహించని రీతిలో ఫలితం రావడంతో ఆయనతోపాటు, ఆయన సన్నిహితులు కూడా కంగుతిన్నారు.
- Advertisement -