Monday, December 23, 2024

వచ్చే వారం బిజెపి తీర్థం పుచ్చుకోనున్న అమరీందర్ సింగ్

- Advertisement -
- Advertisement -

 

Amarinder Singh

న్యూఢిల్లీ: పంజాబ్  లోక్ కాంగ్రెస్ (పిఎల్‌సి) చీఫ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వచ్చే వారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. దీనికితోడు సింగ్ కొత్తగా సృష్టించిన పార్టీని బిజెపితో కలుపుతారు. 80 ఏళ్ల రాజకీయ నాయకుడు ఆకస్మికంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, 2021లో పిఎల్ సిని  స్థాపించారు. ఢిల్లీలో, జెపి నడ్డా , ఇతర ప్రముఖుల సమక్షంలో ఆయన అధికారికంగా బిజెపిలో చేరనున్నారు.

భాజపాలో చేరిన తర్వాత అందులోముఖ్య స్థానం పొందే అవకాశం ఉందన్న పుకార్ల మధ్య ప్రముఖ రాజకీయ నాయకుడు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ,  కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 18న ఆయన న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News