Thursday, January 23, 2025

‘కెప్టెన్ మిల్లర్’ ఆరంభం

- Advertisement -
- Advertisement -

 

జాతీయ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా గురువారం నాడు చెన్నైలో ప్రారంభమైంది. ముఖ్యమైన పాత్రలో నటించనున్న సందీప్ కిషన్, ధనుష్ సరసన నటించనున్న హీరోయిన్ ప్రి యాంక మోహన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 1930–40ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ని టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జి. శరవణ న్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నా రు. బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చి త్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా శ్రే యాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భా షల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News