Wednesday, January 22, 2025

‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ ధనుష్ నటించిన భారీ పీరియాడికల్ మూవీ కెప్టెన్ మిల్లర్. 1930–40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టిజి త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న’కెప్టెన్ మిల్లర్’ టీజర్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు మేకర్స్. ఈ టీజర్ ఈనెల28న విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News