Thursday, January 23, 2025

కెప్టెన్ మిల్లర్ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. 2023లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ 1930-40ల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్ ,అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు.ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర నిర్మాతలు టీజర్‌ను విడుదల చేశారు.

హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ కి హీరో సందీప్ కిషన్‌తో పాటు 500+ మంది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ లాంచ్‌ హైదరాబాద్‌లో మాత్రమే జరుగుతోంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ధనుష్ అన్న స్వయంగా దర్శకత్వం వహించే D 50లో నేను ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నానని ధనుష్ అన్న పుట్టినరోజు సందర్భంగా చెబుతున్నా’ అన్నారు . టీజర్ విషయానికి వస్తే, డకాయిట్, హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రకటించిన భారీ రివార్డ్ నోట్ తో ఆసక్తికరంగా టీజర్ ప్రారంభమవుతుంది.

ఇతర ప్రముఖ పాత్రలను పరిచయం చేసిన తర్వాత, పెద్ద యుద్ధంలో ఉన్న కెప్టెన్ మిల్లర్ ఆగ్రహాన్ని టీజర్ చూపిస్తుంది. ధనుష్, ఇతర తారాగణం నటించిన బ్రీత్ టేకింగ్ యాక్షన్ సన్నివేశాల అత్యద్భుతంగా వున్నాయి.ధనుష్ బ్రిలియంట్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. ఈ టీజర్‌లో ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్‌కుమార్‌లు కూడా పరిచయం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News