Tuesday, January 21, 2025

సంక్రాంతికే ‘కెప్టెన్ మిల్లర్’

- Advertisement -
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్  హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గుబుర గడ్డం, మ్యాసీ హెయిర్, షేడ్స్ తో టెర్రిఫిక్ గా కనిపించారు ధనుష్. 1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యాజ్ బడ్జెట్ తో ఈ  చిత్రం రూపొందుతోంది

డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ  పీరియడ్ ఫిల్మ్ లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగా నటిస్తోంది.  టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్ , అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు.

ఈ చిత్రం ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, సిద్ధార్థ నుని డీవోపీ గా పని చేస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తున్నారు. నాగూరన్ ఎడిటర్. ‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News