Monday, January 20, 2025

డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘కెప్టెన్’..

- Advertisement -
- Advertisement -

Captain Movie Pre Release Event in Hyderabad

ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ’కెప్టెన్’. ఇందులో ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం నటిస్తున్నారు. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో ఆర్య మాట్లాడుతూ “కెప్టెన్… ఒక డిఫరెంట్ ఫిల్మ్. తెలుగులో సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన ’విక్రమ్’ సక్సెస్‌ను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ రాశారు. కొన్నిసార్లు తమిళ పాటల కంటే తెలుగు పాటలు బావున్నట్లు అనిపించాయి. తెలుగులో రాకీ మంచి డైలాగులు రాశారు. ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాను దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ అద్భుతంగా తెరకెక్కించారు . ప్రేక్షకులకు ‘కెప్టెన్’ విభిన్నమైన అనుభూతినిస్తుంది”అని అన్నారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ “ఇవాళ ప్రేక్షకులు ఏమైతే కోరుకుంటున్నారో… అటువంటి డిఫరెంట్ ఫిల్మ్ ’కెప్టెన్’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోంది. దాని కోసమే మా సంస్థలో విడుదల చేయాలని ఆర్యను కలిశా. ఆయన కూడా సంతోషంగా చేయమన్నారు. తప్పకుండా ‘కెప్టెన్’ పెద్ద విజయం సాధించి ఆర్యకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రాజ్ కుమార్, మహేశ్వర రెడ్డి, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, దర్శకుడు సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Captain Movie Pre Release Event in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News