Monday, December 23, 2024

బుమ్రాకు కెప్టెన్సీ సరికాదు..

- Advertisement -
- Advertisement -

ముంబై : ఐర్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గాయం కారణంగా సుదీర్ఘ కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న బుమ్రాను ఏకంగా కెప్టెన్‌గా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బిసిసిఐ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీ ఒత్తిడి బుమ్రాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వస్తున్న ఆటగాడికి కెప్టెన్సీ ఎలా అప్పగిస్తారని మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్‌దేవ్, గంభీర్, ఆకాశ్ చోప్రా, హర్భజన్ తదితరులు ప్రశ్నిస్తున్నా రు. త్వరలో జరిగే వరల్డ్‌కప్ ముందు బుమ్రాపై ఒత్తిడి పెంచడం సరికాదని వారు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News