Monday, January 27, 2025

బంజారాహిల్స్‌లో కారు భీభత్సం

- Advertisement -
- Advertisement -

అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన సంఘటన బంజారాహిల్స్‌లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగాయపడ్డారు. బసవతారకం ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుండగా మద్యం తాగి వేగంగా కారు నడుపుకుంటూ వచ్చిన వ్యక్తి అదుపు తప్పడంతో నిద్రిస్తున్న వారిపైకి కారును పోనిచ్చాడు. దీంతో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. కారు ప్రమాదం జరగగానే కారును నడుపుతున్న వ్యక్తి కారును అక్కడే పడేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేశారు.

కారు ప్రమాదానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన షార్ట్ ఫిల్మ్ డైరెక్టరే కారణమని గుర్తించారు. నిందితుడు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకూ ఫుల్‌గా మద్యం తాగాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్లు చెప్పారు. మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపినట్లు పేర్కొన్నారు. అయితే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి గాయపడినట్లు తెలిపారు. అనంతరం నిందితుడు తన వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు చెప్పారు. నంబర్ ప్లేట్ ఆధారంగా కారు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిదిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News