Wednesday, January 22, 2025

కారు ఢీకొని మహిళ మృతి… ల్యాంకో హిల్స్ సమీపంలో సంఘటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గార్డెనింగ్ చేస్తున్న మహిళను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాంకో హిల్స్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… కారు డ్రైవింగ్ చేసుకుంటు వస్తున్న మహిళ ల్యాంక్ హిల్స్ వద్ద గార్డెనింగ్ చేస్తున్న ముగ్గురు మహిళలను కారుతో ఢీకొట్టింది.

దీంతో జయమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతిచెందిన మహిళ మృతదేహాన్ని పోస్టుంమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవింగ్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News