Wednesday, February 19, 2025

జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంతో అదుపు తప్పి ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను ఢీకొట్టిన సంఘటన శనివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….బిఎండబ్లూ కారు నంబర్ టిఎస్ 09 ఎఫ్‌ఐ9990 తెల్లవారుజామున వేగంగా దూసుకు వచ్చిన కారు అదుపు తప్పి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాఫిక్ పోలీస్ బూత్ పూర్తిగా ధ్వంసం అయింది. కారు పోలీస్ బూత్‌ను ఢీకొట్టగానే అందులో ఉన్న వ్యక్తి కిందికి దిగి అక్కడి నుంచి పారిపోయాడు. కారు ప్రమాదం జరగగానే అందులోని ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు.

కారు ఎవరిది అనే దానిపై విచారణ చేయగా, మాలిక్ జెమ్స్ అండ్ జువెలరీ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరగగానే కారు నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడని గుర్తించారు. మద్యం మత్తులోనే కారును వేగంగా నడపడంతో అదుపు తప్పి పోలీస్ బూత్‌ను ఢీకొట్టిందని ప్రాథమికంగా నిర్దారించారు. కారుపై రెండు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ రోడ్డుపై లేకపోవడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ జాం కాకుండా వెంటనే కారును పోలీసులు అక్కడి నుంచి తొలగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News