Thursday, December 26, 2024

బంజారాహిల్స్‌లో కారు భీభత్సం

- Advertisement -
- Advertisement -

అదుపు తప్పిన కారు భీభత్సం సృష్టించిన సంఘటన బంజారాహిల్స్ కేబిఆర్ పార్క వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన పోర్షే కారు వేగంగా వచ్చి కేబిఆర్ పార్క్ వద్ద ఉన్నఫుట్‌పాత్‌ను ఢీకొట్టడంతో ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం అయింది. అయినా కూడా కారు ఆగకుండా అక్కడే ఉన్న చెట్టును ఢీకొట్టింది, దీంతో కారులో బెలూన్లు తెరుచుకోవడంతో కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే కారులో నుంచి దిగిన డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు, కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో అది ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫుట్‌పాత్‌పై ఉన్న క్యాన్సర్ రోగుల సహాయకులు, నిరాశ్రయులు ప్రాణ భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News