- Advertisement -
మేడ్చల్: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఓఆర్ఆర్ పై వేగంగా దూసుకొచ్చిన బెంజ్ కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టి.. ఎదురుగా వస్తున్న మరో టాటా విస్టా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం దావఖానాకు తరలించారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కీసర ఓఅర్ఆర్ సర్కిల్ సమీపంలో ఘట్కేసర్ నుండి వస్తున్న బెంజ్ కార్, షామీర్పెట్ వైపు నుండి వస్తున్న టాటా కార్ ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -