Friday, January 10, 2025

శంషాబాద్‌లో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆడి కార్ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగం తో అదుపు తప్పి అవతలి రోడ్డు పై పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్టు పొలీసులు స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమే అయి ఉంటుందని పొలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఎయిర్ పోర్ట్ పొలీసులు వెల్లడించారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆడి కారులో తమ బంధువులకు సెండాఫ్ చెప్పి తిరిగి వస్తున్నాడు. అయితే ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో మితిమీరిన వేగంతో వస్తున్న కారు సగం దూరం చేరుకోగానే అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొని అవతలి రోడ్డులో పల్టీలు కొట్టింది.

దీంతో కారు ఎయిర్ బెలూన్లు ఓపెన్ అయ్యాయి.అయితే కారు నడుపుతున్న వ్యక్తి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. దీంతో ఎయిర్‌పోర్టు ప్రధాన దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. అయితే విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వ్యక్తిని 108 వాహనంలో ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. దీంతో స్థానిక పోలీసులు పూర్తిగా నుజ్జునుజ్జు అయిన ఆడి కారును రోడ్డు మధ్యలో నుంచి తీయించి స్టేషన్‌కు తరలించారు. కారు నడిపిన వ్యక్తి మద్యం సేవించాడా లేదా ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News