Wednesday, January 22, 2025

బాపట్లలో ఘోర కారు ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కొరిసపాడు మండలంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొరిసపాడు మండలం మేదరమెట్ల బైపాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు టైరు పంక్చర్‌ కావడంతో వాహనం అదుపు తప్పి డివైడర్‌పై నుంచి రోడ్డుకు అవతలి వైపునకు వెళ్లింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ ఆటోను ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు మహిళలు మృతి చెందారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను వహీదా, ఆమె కుమార్తె ఆయేషా, జయశ్రీ, దివ్య తేజ, డ్రైవర్ బ్రహ్మచారిగా గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు. మృతులు చిన్న గంజాం జాతర పండుగను సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బాధిత కుటుంబాలకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News