Wednesday, January 22, 2025

గచ్చిబౌలిలో కారు బోల్తా: ఒకరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో శనివారం తెల్లవారుజామున ఘోర కారు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకోచ్చిన కారు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ దగ్గర డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు స్పాట్ లోనే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News