Thursday, January 23, 2025

హబ్సిగూడలో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినప్పటికి వాహనదారుల్లో మార్పు రావడం లేదు. మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఓయూ పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో కారు నడిపిన యువకులు బీభత్సం సృష్టించారు.

హబ్సిగూడలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఘటన సమయంలో ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఆటోలో ఉన్న నలుగురిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News