Monday, December 23, 2024

హైటెక్‌సిటీలో కారు బీభత్సం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. నోవటెల్ హోటల్ సమీపంలో కారు అతివేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతి యువకుడు మద్యం మత్తులో కారు నడిపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన కారు నంబర్ ప్లేట్‌ను తొలగించారు. క్షతగాత్రుల వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News