Monday, December 23, 2024

ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Car accident in Khairatabad flyover

హైదరాబాద్ : మద్యం మత్తులో కారు నడపడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు గాయపడిన సంఘటన నగరంలోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….నగరానికి చెందిన విశాల్, మరో యువకుడు తెల్లవారుజామున కారులో ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌లో ఐమాక్స్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్‌తో డ్రైవ్ చేయడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ఇద్దరు యువకులు గాయాలతో బయటపడ్డారు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. కారుపై ఇప్పటి వరకు ఆరు ఓవర్ స్పీడ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. వేగంగా కారును నడపడంతో హన్మకొండ, కరీంనగర్, భువనగిరి పోలీసులు జరిమానా విధించారు. ఓవర్ స్పీడ్‌కు సంబంధించిన రూ.3,235 జరిమానాలు ఉన్నాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు కారు అక్కడి నుంచి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News