Monday, December 23, 2024

జమ్ముకాశ్మీర్ లో ఘోర కారు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజౌరి జిల్లాలోని తనమండి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also Read: హయత్‌నగర్‌లో దారుణం ఘటన..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News