Sunday, December 22, 2024

కారు ప్రమాదం: తల్లీకొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: జిల్లాలోని కేతపల్లి మండలం ఇనుపాముల వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారు చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ప్రమాద దాటికి కారులో మంటలు చెలరేగాయి.

ప్రమాద సమయంలో వెనక నుంచి వస్తున్న వాహనదారులు గుర్తించి బాధితులను కారులో నుంచి సకాలంలో బయటికి తీయడంతో మృతుల సంఖ్య తగ్గింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉన్నాట్లు సమాచారం. మృతులు తల్లి కొడుకులు ఫణి కుమార్(43 )కరుణ (70)గా గుర్తించారు. ఫణి కుమార్ భార్య కృష్ణవేణి, పాప, మరొకరికి గాయాలు అయ్యాయి. వీరంత సూర్యాపేట విద్యానగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు. క్షతగాత్రులను 108 లో నకరికల్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News