Monday, January 20, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారిలో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర లోని ప్రైవేటు ఆసుపత్రికి పోలీసులు తరలించారు. బంధువులకు ఎయిర్‌పోర్టులో వీడ్కోలు చెప్పి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గాయ పడిన వారంతా సంగారెడ్డి వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News