Monday, December 23, 2024

తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

ఒంటిమిట్ట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన లారీ, కారు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను మహబూబ్ నగర్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మహబూబ్ నగర్ నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News