Saturday, November 23, 2024

అనంతగిరి హిల్స్‌లో కారు, బైక్ రేసింగ్ ఘటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వికారాబాద్ అనంతగిరి కొండల్లో జరిగిన కారు, బైక్ రేసింగ్ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదులో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున హాలిడే కావడంతో అనంతగిరి కొండలకు భారీగా వెళ్లిన యువతీ, యువకులు కార్ల రేసింగ్ నిర్వహించారు. సైరన్ వేసుకుంటూ దూసుకువచ్చి విన్యాసాలు నిర్వహించి, హంగామా సృష్టించారు. బైక్ లతో స్టంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించిన పలువురు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే అనంతగిరి కొండల్లో కార్ల రేసింగ్ నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం కనబర్చారు.

వీకెండ్స్‌లో హైదరాబాద్ నుంచి వస్తున్న కొందరు అనంతగిరి కొండల్లో కార్ల రేసింగ్ నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుుతన్నారు. కార్ల రేసింగ్‌ను అరికట్టాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు వైరల్‌గా మారిన వీడియోల ఆధారంగా రేసింగ్‌లో పాల్గొన్న వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులు రేసింగ్ జరిగిన చోటును పరిశీలించారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మూడు బైక్‌లు, మూడు కారులను పోలీసులు సీజ్ చేశారు. మూడు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక, ఈ ఈవెంట్‌ను సాయి సన్మాన్ అనే వ్యక్తి ఆర్గనైజ్ చేసినట్టుగా గుర్తించారు. అతడు గతంలో కూడా ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినట్టుగా పోలీసులు తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News