Monday, January 20, 2025

కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -
కటాక్షపూర్-ఆత్మకూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం
మరో ఇద్దరికి తీవ్రగాయాలు… ఒకరి పరిస్థితి విషమం…

మన తెలంగాణ/హన్మకొండ ప్రతినిధి: హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం… వరంగల్ నగరంలోని కాశిబుగ్గ సొసైటీ కాలనీకి చెందిన ఎనిమిది మంది కారులో ఆదివారం మేడారంలోని సమ్మక్క సారలమ్మ దర్మనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఆత్మకూరు మండల కేంద్రం శివారులో ఆత్మకూరు———–కటాక్షపూర్ ప్రధాన జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారును టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న అనుముల నరసింహస్వామి (50), వెల్దండి సాంబరాజు (42), వెల్దండి ఆకాంక్ష (26), వెల్దండి లక్ష్మి ప్రసన్న (6)లు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనుముల రాజేశ్వరి (50), అనుము ల అక్షిత (20)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థా నికులు క్షతగాతుల్రను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందగానే సంఘట నా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News