Monday, February 3, 2025

ఉత్తర సిరియాలో కారు బాంబు విస్ఫోటనం: 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

డామస్కస్(సిరియా): ఉత్తర సిరియా నగరం శివార్లలో సోమవారం కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. వారిలో 18 మంది మహిళలు కాగా, ఒకరు పురుషుడు. ఇంకా చాలా మంది క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చారు. మన్బిజ్ నగర శివార్లలో మహిళా వ్యవసాయ కార్మికులను తీసుకెళుతున్న వాహనం పక్కన ఈ కారు బాంబు పేలింది. మొహమ్మద్ హాస్పిటల్ నర్సు కథనం ప్రకారం ఒక పురుషుడు సహా 18 మంది మహిళలు చనిపోయారని ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వార్తా సంస్థ తెలిపింది. వీరితో పాటు మరో 15 మంది మహిళలు గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు ఘటనకు తామే బాధ్యులమంటూ ఏ గ్రూప్ ఇంత వరకు చెప్పుకోలేదు. డిసెంబర్ నెలలో అధ్యక్షుడు బషర్ పాలన అంతమయ్యాక ఈశాన్య అలెప్పో ప్రాంతంలోని మన్బిజ్‌లో ఇంకా ఇలాంటి హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. పేలిన కారును రోడ్డు పక్కన నిలిపి ఉంచినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News