Wednesday, January 22, 2025

కాబూల్‌లో కారు బాంబు పేలుడు: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Car bomb explodes in Kabul: Seven dead

కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లో శుక్రవారం జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరో 41 మందికి తీవ్రగాయాలయ్యారు. వజీర్ అక్బర్ ఖాన్ మసీదుకు సమీపంలో రోడ్డు పక్కన ఉంచిన కారు బాంబు పేల్చారు. ప్రార్థనలు ముగించుకుని మసీదు నుంచి బయటకు వెళ్లే భక్తులే లక్ష్యంగా పేలుడు జరిగినట్లు కాబూల్ పోలీసు చీఫ్ అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ అఫ్గాన్ లో తరచూ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న ముచ్చట తెలిసిందే. శుక్రవారం ప్రార్థనలు ముగించుకుని భక్తులు బయటకు వస్తుండగా పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని మసీదు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి, పేల్చివేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ తెలిపారు. ఘటనా స్థలంలో పోలీసు విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. రాజధాని కాబూల్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పేలుళ్లు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News