Sunday, January 19, 2025

కారులో కాలిన స్థితిలో మూడు మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

బెంగలూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ కారులో కాలిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. పోలీస్‌లు, దర్యాప్తు బృందాలు కీలకమైన ఆధారాలు సేకరించారు. మృతులు మంగళూరులోని బెల్తంగడి తాలూకాకు చెందిన వారుగా గుర్తించారు. త్వరలోనే దీని వెనుక ఉన్న ముఠాను పట్టుకుంటామని పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కేవీ తెలిపారు. నిధిని విక్రయిస్తామనే సాకుతో నిందితులు ముగ్గురిని మోసగించి, హత్య చేసినట్టు పోలీస్‌లు అనుమానిస్తున్నారు.

బాధితులను వేరే ప్రాంతంలో చంపి, ఇక్కడికి తీసుకొచ్చి మృతదేహాలను తగులబెట్టారని భావిస్తున్నారు. నిధిలో దొరికిన బంగారు నగలు విక్రయిస్తామని నమ్మించిన దుండగులు వారిని హత్యచేసి, డబ్బు, నగలను దోచుకున్నారు. వాహనం లోనే వారి మృతదేహాలను తగులబెట్టారు. ఈ సంఘటనలో సుమారు ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News