- Advertisement -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారు దహనమైంది. తుమ్మలబైలు సమీపంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, కారు మాత్రం పూర్తిగా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలకు అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
- Advertisement -