కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగుస్తోంది. తర్వాత కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో చాలా మంది నూతన సంవత్సరంలో అనేక వస్తులు కొంటాము. ఒకవేళ ఈ ఏడాదిలో కొత్త కార్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు, కారు బీమా పాలసీ, అనేక ఇతర వస్తువులను కొనుగోలు చేయడం అవసరం. ఇప్పుడు కొత్త కారును కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి విషయాలను గుర్తించుకోవాలి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
మొదటగా గుర్తించుకోవాల్సిన విషయం బడ్జెట్. ఇష్టమైన కారును కొనుగోలు చేయబోతున్నప్పుడు దాని సరిపడా బడ్జెట్‌ను ఖచ్చితంగా సిద్ధం చేసుకోవాలి. కార్ ప్రాధాన్య ధరను లెక్కించినప్పుడు.. దాని ఎక్స్-షోరూమ్ ధర, బీమా ధర, ఉపకరణాలు మొదలైన వాటి గురించి తెలుసుకోవాలి.
అవసరానికి తగ్గట్టు ఎలాంటి కారు కావాలో తెలిసిఉండాలి. హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUV వంటి బాడీ మోడల్‌లు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎలాంటి వాహనం అవసరమో తప్పక తెలిసి ఉండాలి. ఎందుకంటే కార్ ను బట్టి ధర ఉంటుంది.
ఏదైనా కారును కొనుగోలు చేసేటప్పుడు అందులో ఎన్ని సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో చూసుకోవాలి. అలాగే, దాని సేఫ్టీ రేటింగ్ ఏమిటో తప్పకుండా తనిఖీ చేయాలి. మంచి సేఫ్టీ రేటింగ్‌తో కారును కొనుగోలు చేస్తే, ప్రయాణంలో ప్రమాదాల నుండి సురక్షితంగా ఉండటానికి సహాయ పడుతుంది.
ప్రతి కారులో విభిన్న ఫీచర్లు ఉంటాయి. అందువల్ల ప్రతి కారు ఫీచర్స్ జాగ్రత్తగా పరిశీలించి, వాటిని సరిపోల్చండి. అంతేకాకుండా.. కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు, దాని టెస్ట్ డ్రైవ్ తప్పక చేయాలి. కారు గురించి ప్రతిదీ తెలిసినప్పటికీ టెస్ట్ డ్రైవ్ చేయాలి.