Friday, November 22, 2024

భానుడి ప్రతాపానికి కారు దగ్ధం

- Advertisement -
- Advertisement -

గద్వాల టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. మండుతున్న ఎండలకు ప్రజలు అత్యవసరమైతే బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా ఈ ఎండ ప్రతాపానికి ఓ కారులో మంటలు చేలరేగి కారు పూర్తిగా కాలి బూడిద అయిన సంఘటన గురువారం గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లా డోన్ కు చెందిన అమానుల్లా గురువారం గద్వాల పట్టణంలో తన బంధువుల ఇంటికి వచ్చాడు.

అనంతరం బంధువులతో కలిసి భీంనగర్‌లో గల ఓ హోటల్ ముందు ఏపీ 16 యూబి 0611 నంబర్‌గల కారును పార్కు చేసి భోజనానికి వెళ్లారు. భోజనం అనంతరం కారు దగ్గరకి వచ్చి చూడగా కారులోనుంచి దట్టమైన పొగలు కనిపించాయి. కారు డోర్ తెరిచి చూడగా మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోతుండటంతో అగ్నిమాఫక సిబ్బందికి పోన్ చేశారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు ఆర్పడం జరిగింది. రూ.3.50 లక్షల ఆస్థినష్టం వాటిలిందని వాహనదారుడు తెలిపారు. కాగ ఎండతీవ్రత అధికంగా ఉందని వాహనాల్లో ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News