Saturday, February 22, 2025

కదులుతున్న కారులో మంటలు

- Advertisement -
- Advertisement -

Car catches fire in Banjara Hills

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో బుధవారం ఉదయం కదులుతున్న కారులో మంటలు చెలరేగాయి. శంషాబాద్ విమానాశ్రయం నుండి మూసాపేట్ వెళ్తున్న కారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వద్దకు చేరుకోగానే మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. డ్రైవర్‌, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంటల్లో కారు కొద్ది నిమిషాల్లోనే దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సాంకేతిక లోపమే ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News