Sunday, December 22, 2024

సెక్రటేరియట్ సమీపంలో కారు దగ్ధం.. భారీగా ట్రాఫిక్ జాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ సమీపంలో కారు దగ్ధం అయిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కారులో వెళ్తున్న వారు ఒక్కసారిగా మంటలు రావడంతో కారులో నుంచి దిగి అందులోని విలువైన వస్తువులు బయటకు తీసుకున్నారు. నడిరోడ్డుపై కారు దగ్ధం కావడంతో అటువైపు వెళ్తున్న వాహనాలు భారీగా ఆగిపోయాయి. రద్దీ సమయం కావడంతో సెక్రటేరియట్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News