Thursday, January 23, 2025

సన్‌ సిటి వద్ద కారు దగ్ధం

- Advertisement -
- Advertisement -

మంటలు చెలరేగి కారు దగ్ధమైన సంఘటన నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని జరిగింది. బుధవారం మధ్యాహ్నం లంగర్‌హౌజ్ నుంచి వెళ్తున్న కియా కారు హైదర్‌షాకోట్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ వద్దకు రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారులో ఉన్న వ్యక్తులు బయటికి రావడంతో పెనుప్రమాదం తప్పింది. నడిరోడ్డుపై కారు దగ్ధం కావడంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమీపంలోని ఆర్మీ అధికారులు ఫైరింజన్‌లను పంపి మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News