Sunday, December 22, 2024

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కారు అదుపు తప్పి ఆగి ఉన్న డిసిఎంను ఢీకొట్టిన సంఘటన సోమవారం తెల్లవారు జామున బంజారాహిల్స్‌లో రోడ్డు నంబర్ 3లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లోని రెయిన్‌బో ఆస్పత్రి వద్ద డిసిఎం ఆగి ఉంది. కారు వస్తు అదుపు తప్పడంతో అతివేగంగా వచ్చి డిసిఎంను ఢీకొట్టింది.

దీంతో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డుతోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజుజ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News