Monday, December 23, 2024

డిసిఎంను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

జనగామ: ఆగి ఉన్న డిసిఎంను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డిసిఎం టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి డ్రైవర్, క్లీనర్ టైరు మార్చుతున్నారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన కారు డిసిఎంను ఢీకొట్టడంతో డిసిఎం డ్రైవర్, క్లీనర్, కారులో ఉన్న పాప దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News