Thursday, December 26, 2024

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి…

- Advertisement -
- Advertisement -

Car collided electrical pole in Vizag

విశాఖపట్నం: అతివేగంతో దూసుకెళ్లిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్డంతో ప్రహారి గోడకు స్తంభానికి మధ్యలో ఇరుక్కున సంఘటన విశాఖపట్నం జిల్లా వెంకటాపురం-రాంబిల్లి రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వ్యక్తి కారును అతి వేగంగా నడిపించడంతో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఒక్కరే ఉండడంతో పాటు ఎయిర్ బ్యాగ్‌లు ఓపెన్ కావడంతో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. అనంతరం స్తంభం, ప్రవాహారి గోడ మధ్యలో కారు ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో ఆవు దుర్మరణం చెందడంతో రూ 30 వేల రూపాయల పరిహారం అందించాడు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అచ్చుతాపురం పోలీసులు తెలిపారు. అతివేగంతో పాటు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News