Wednesday, January 22, 2025

పోలీసులను ఢీకొట్టిన కారు… కానిస్టేబుల్ కాలు తెగిపడిపోయింది…

- Advertisement -
- Advertisement -

భోపాల్: మద్యం మత్తులో కారు వేగంగా నడిపి పోలీసులపైకి దూసుకెళ్లడంతో ఒక కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం రైజెన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బరేలీ టౌన్‌లో ఓ చౌరస్తాలో ఇద్దరు పోలీసులు రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు పూటుగా మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తున్నారు. కారు అతివేగంగా వచ్చి ముగ్గురు పోలీసులను ఢీకొట్టింది. రాజేంద్ర యాదవ్, హరిసింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. రాజేంద్ర యాదవ్ కాలు పూర్తిగా తెగిపడిపోయింది. రాజేంద్ర యాదవ్ చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌పి అమ్రిత్ మీనా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News