Friday, December 20, 2024

సూర్యాపేటలో ఆటోను ఢీకొట్టిన కారు: మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

మునగాల : సూర్యాపేట జిల్లాలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను తక్షణమే కోదాడ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ దుర్ఘటన జరిగిందని బాధితులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News