Saturday, December 21, 2024

బస్సును ఢీకొట్టిన కారు… డ్రైవర్ లేకుండానే బస్సు 150 మీటర్లు దూసుకెళ్లి…

- Advertisement -
- Advertisement -

Car collided with bus in Nell ore dist

అమరావతి: టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న ఆర్ టిసి బస్సును కారు ఢీకొట్టడంతో బస్సు 150 మీటర్లు దూసుకెళ్లిన సంఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆర్‌టిసి బస్సు కావలి నుంచి నెల్లూరు జిల్లాకు వెళ్తుండగా కావలి శివారులో టోల్‌ప్లాజా వద్ద బస్సు ఆగింది. కారు అత్యంత వేగంగా వచ్చి బస్సును ఎదురుగా ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ కిందపడిపోయాడు. డ్రైవర్ లేకుండానే బస్సు కదలడంతో ప్రయాణికులు కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన కండక్టర్ నాగరాజు బ్రేకులు వేశాడు. అప్పటికే బస్సు 150 మీటర్ల దూరం ప్రయాణించింది. కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రసాద్‌తో పాటు పది మంది ప్రయాణికులు, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. కారు విశాఖపట్నానికి చెందిన వైద్యుడు విజయ్ పంత్‌ది గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News