Tuesday, January 21, 2025

ఆటోలను ఢీకొట్టిన కారు: 17 మంది విద్యార్థులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని ఆనంద్ బాగ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. లోకో కాలనీలో కారు అతివేగంగా రెండు ఆటోలను ఢీకొట్టడంతో 17 మంది స్కూల్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కారు నంబర్ ఎపి 32 ఎండి 0873గా గుర్తించారు.

గాయపడిన విద్యార్థులు సిఎంఎస్, ఎల్‌పిఎస్, సెయింట్ థెరిస్సా స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ఆటో డ్రైవర్ లాల్ బహదూర్ కాలు విరిగిపోవడంతో స్పిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. డిసిపి పంకజ్ కుమార్ సింగ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News