Monday, December 23, 2024

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హన్మకొండ : హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, పెంచికలపేట్ స్టేజీ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ గోదారి రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరు నాగారంనకు చెందిన బంగారు వ్యాపారి మంతెన కాంతయ్య, మంతెన శంకర్ ఇద్దరు అన్నదమ్ముల రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రాజన్న దర్శనం కోసం ఇంటి నుంచి కారులో బయలుదేరారు. ఎల్కతుర్తి మీదుగా అర్ధరాత్రి సుమారు 1.30 గంటల సమయంలో పెంచికలపేట్ శివారుకు చేరుకోగా స్థానిక వివాస్ ఇండస్ట్రీ వద్ద గుజరాత్ నుంచి ఏలూరు వెళ్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వచ్చి ఢీకొంది.

ఈ ప్రమాదంలో మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్ (60), మంతెన భరత్ (28), మంతెన చందన (16) అక్కడికక్కడే మృతి చెందారు. మంతెన రేణుక, భార్గవ్, శ్రీదేవిలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న మృతదేహాలను జెసిబిల సాయంతో వెలికితీసి వరంగల్ ఎంజిఎం మార్చరీకి తరలించారు. క్షతగాత్రులను ఎంజిఎంలో చేర్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News