Thursday, January 23, 2025

కారు, తుఫాను ఢీ…10 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం శివారులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొల్లాపూర్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న కారు,హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ కు వెళ్తున్న తుఫాను వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. వాహనాలలో ఉన్న పది మందికి గాయలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను నాగర్ కర్నూల్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News