Sunday, December 22, 2024

ఆటో ను ఢీకొన్న కారు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : మండలంలోని 44 వ జాతీయ రహాదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలైనట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లా బాబన్ గ్రామానికి చెందిన ఎండి.ఆరిఫ్ 16 భవనాలలో పిఓపి వర్క్ చేస్తుంటాడు. గురువారం తోటి వర్కర్‌లతో కలసి సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తాకు వెళ్లి తిరిగి ఏపి 25 ఎక్స్ 6677 నంబరు గల ఆటోలు కామారెడ్డి కి బయలుదేరి వెళుతున్నారు.

మార్గమద్యలో అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ స్టేజీ 44 వ జాతీయ రహాదారి బ్రిడ్జీ వద్ద వెనుక నుండి టిఎస్ 09 ఎఫ్‌పి3144 కియా కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో ప్రయాణిస్తున్న వారందరికి గాయాలు కాగా ఆరీఫ్ పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మృతుని మామ అర్భాజ్, తండ్రి కరీముల్లా ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News