Tuesday, September 17, 2024

కారు ఢీ.. గాల్లోకి ఎగిరిపడ్డ యువతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని వనస్థలిపురం ఎన్జీఒఎస్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివేకానంద పార్క్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె 10 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News