Monday, January 20, 2025

ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

Car crash on Khairatabad flyover bridge

హైదరాబాద్: ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించిన సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. ఇద్దరు యువకులు, డ్రైవర్‌తో వెళ్తున్న ఎపి 09 బిడబ్లూ 6219 కారు ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై అతివేగంగా వెళ్లడంతో అదుపు తప్పింది.దీంతో కారు డివైడర్‌ను ఢీకొట్టింది, సీటు బెల్టుపెట్టుకోవడం, బెలూన్లు ఓపెన్ కావడంతో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News