Thursday, January 9, 2025

డివైడర్ ను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Car crashes into divider: Two killed

ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో ప్రయాణించిన ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను శ్రీకాంత్, శ్రీనివాసులుగా గుర్తించారు. తిరుపతి నుంచి మహబూబ్ నగర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు బాధితులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News